రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించిన సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, November 2, 2022

రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించిన సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి

 రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించిన సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి 

 


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


రాజీ మార్గం రాజా మార్గం అని కక్ష దారులు సద్వినియోగం చేసుకోవాలని మరియు రాబోయే నవంబర్ 12వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించిన సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి 

శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి  బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి అన్ని శాఖ అధికారులతో పరిచయ మరియు సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి, మరియు ఏపిపిలు శేఖర్, జయశేఖర్, మరియు  శ్రీకాళహస్తి  కోర్ట్ పరిధిలో శ్రీకాళహస్తి అర్బన్ మరియు రురల్,తొట్టంబేడు, కెవిబి పురం,ఏర్పేడు,బిఎన్ కండ్రిగ మండల అన్ని శాఖలు ( రెవిన్యూ, పోలీస్, మునిసిపల్,ఎంపిడిఓ, సీడీపీఓ,ట్రాన్స్పోర్ట్, ఫైర్,ఫారెస్ట్, లేబర్, అన్ని బ్యాంక్ లు) ఉన్నతాధికారులు,కోర్ట్ సిబ్బంది,.. మొదలినవాలు పాల్గొన్నారు.

 న్యాయమూర్తి మాట్లాడుతూ.....  గౌ : సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాబోయే నవంబర్ 12వ తేదీన జరుగు జాతీయ లోకఅదాలత్ విజయవంతం చేయాలని కోరారు. అలాగే నవంబర్ 12న  నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్ష దారులు, న్యాయవాదులు, ప్రజల సహకరించి విజయవంతం చేయాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.

అనంతరం శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్లు సబ్ జైలులోని ఖైదీలకు న్యాయ సలహాలు, సూచనలు అందించారు. మరియు లోబావిలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత న్యాయ సేవా ఎలా పొందాలని, అలాగే వారికి కూడా న్యాయపరమైన అవగాహన కల్పించారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad