విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయం మండపం పనులు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న విజ్ఞానగిరి కుమారస్వామి ఆలయం పరిధిలోని ఉన్న పురాతన మండపంలో వెలిసి ఉన్న వినాయక విగ్రహాన్ని తొలగించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పురాతన మండపం పనులు చేపట్టడానికి ఇటీవల బాలాలయ స్థాపన పూజలు నిర్వహించారు. మండపంలోని వినాయక విగ్రహాన్ని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలోని స్థానిక భక్తుల సమక్షంలో విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం కింద ఎలాంటి వస్తువులు ఉన్నాయేమో అని పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వి.ఆర్.ఒ ప్రసన్న శ్రీ, బాల మురళి, వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్,DE శ్రీనివాసులు రెడ్డి, AE శోభ రాణి, AEO లోకేష్ రెడ్డి, స్థపతి కుమార్, సబ్ టెంపుల్ సించార్జ్ లక్ష్మయ్య, ఆలయ అర్చకులు రామకృష్ణ, కాంట్రాక్టర్ తేజు మరియు స్థానికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment