ఆలయ లీకేజ్ కి నిపుణుల టెస్టింగ్
ఆధునిక టెక్నాలజీతో సంపూర్ణంగా లీకేజీ నివారిస్తాం: చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
శ్రీకాళహస్తీశ్వరాలయం పై భాగంలో ఏర్పడుతున్న లీకేజీ నివారణకు ఐఐటి నిపుణులు టెస్టింగ్ పనులు చేపట్టారు. స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అభ్యర్థన మేరకు ఇటీవల ఐఐటి నిపుణులు ఆలయంలో లీకేజీలను పరిశీలించారు.. తమ వద్ద ఉన్న ఆధునిక పురాతన టెక్నాలజీని మేళవించి లీకేజీ నివారణకు నిపుణులు ప్రయత్నాలు చేపట్టారు. ఆదివారం తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విచ్చేసిన సాంకేతిక సిబ్బంది, దేవస్థానం చైర్మన్ అం జూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు, స్థానిక ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి తొలత లీకేజీ నివారణకు టెస్టింగ్ ప్రక్రియ చేపట్టారు. గతంలో ఆలయ పైభాగాన మూడు దఫాలుగా కాంక్రీట్ వేసి ఉండడంతో మూడు చోట్ల డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించారు. పాత సున్నపు కట్టడంపై పెంకు నిర్మాణం చేసి ఉన్నారు. దానిపై సన్నటి మెస్ పై చిప్స్ కాంక్రీట్ వేసి ఉన్నారు. దానిపై మరోసారి కాంక్రీట్ వేసి ఉన్నారు. ఐఐటి నిపుణులు మూడు లేయర్లుగా వేసియున్న కాంక్రీట్ ను పరిశీలించారు. మూడు చోట్ల తీసిన శాంపిల్ టెస్టింగ్ రంద్రాల వద్ద తాము ఆధునిక పద్దతి లో పురాతన కట్టడాల నిర్మాణంలో వినియోగించే పదార్థాల మిశ్రమంతో తయారుచేసిన రసాయనాన్ని ఆ రంధ్రాల్లో వేశారు. పది రోజులు పాటు వేచి చూడాలని, రసాయనం ఎంతవరకు వ్యాపించి ఏ మేరకు లీకేజీ నీ అరికడుతుందో అంచనా వేయన్నారు. ఐఐటి నిపుణులు పురాతన కట్టడం నిర్మాణాల్లో వినియోగించే గవ్వ సున్నం, తాటి బెల్లం, కరక్కాయ, జాజికాయ, మెత్తటి ఇసుక తో తయారుచేసిన రసాయనాన్ని వినియోగించారు. ఈ రసాయనం పాత కట్టడంలో ఏర్పడిన లీకేజీల్లోకి చొచ్చుకుని వెళ్లి కట్టడాన్ని పటిష్టతం చేస్తుందని ఐఐటి నిపుణులు తెలిపారు.
తొలుత టెస్టింగ్ ప్రక్రియలో మూడు శాంపిల్స్ వద్ద పరీక్ష చేశారు. పది రోజుల తర్వాత ఇది ఎంతవరకు వ్యాపించి లీకేజీ నివారణ కు దోహదపడుతుందో గుర్తిస్తారు. తదుపరి ఆలయ పైభాగాన వేచి ఉన్న మూడు లేయర్ల కాంక్రీట్లను పూర్తిగా తొలగించి పాత సున్నపు స్లాబుపై మిశ్రమ రసాయనం పూత వేనున్నారు. అయితే రసాయన పూత వేయాలంటే మంచి ఎండలు ఉండాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం తొలి టెస్టింగ్ ప్రక్రియ చేయడంతో తదుపరి ప్రక్రియలను చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ పురాతన ఆలయమైన శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీ సమస్యాత్మకంగా మారిందని, గతంలో చేసిన పనులు మూలంగా లీకేజీ నివారణ కాకపోగా మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. తాజాగా ఐఐటి నిపుణుల సహకారంతో ఆధునిక పురాతన పద్ధతులను మేళవించి పూర్తిస్థాయిలో లీకేజీ అరికట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేవస్థానం కేవీ సాగర్ బాబు గారు మాట్లాడకు పురాతన ఆలయమైన శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీను వీలైనంత త్వరలో దేవస్థానం పూర్తి పైభాగం ఐఐటి నిపుణుల సహకారంతో ఆధునిక పురాతన పద్ధతులను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తర్వాత పూర్తి చేస్తాం ఆవిధంగా ఎండోమెంట్ కమిషనర్ నుండి త్వరగా వచ్చేలా కృషి చేస్తామని అన్నారు
ఈ టెస్టింగ్ ప్రక్రియలో దేవస్థానం డి ఈ మురళీధర్, ఏ ఈ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment