కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వాటర్ ప్యూరిఫైయర్ని అందించిన దాత
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు అనేకమంది రోగులు వస్తూపోతుంటారు. వీరికి మంచినీటి సౌకర్య సమస్య ఉండడం వల్ల అదే మండలానికి చెందిన మామిడిగుంట గ్రామానికి చెందిన మామిడి వినోద్ ఈ ఆరోగ్య కేంద్రంనకు సుమారు 15000 విలువ కలిగిన వాటర్ ప్యూరిఫైయర్ అందించి వారి యొక్క తగునీటి సమస్య పరిష్కరించారు. ప్రముఖ న్యాయవాది భక్తవత్సల నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి వినోద్, ఢిల్లీ బాబు, అరుణజ్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. హాస్పటల్ సిబ్బంది దాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment