బీ.సీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి వేడుకలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, November 28, 2022

బీ.సీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి వేడుకలు

 శ్రీకాళహస్తి పట్టణంలో జాతీయ బీ.సీ సంక్షేమ సంఘం నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


బడుగు బలహీన పేద ప్రజల ఆరాధ్య దైవం, బీ.సీ ల అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలను చేసి సమానత్వమే మానవత్వం అని పిలుపునిచ్చిన మహనీయులు  మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతి వేడుకలను  జాతీయ బీ.సీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు జక్కాల బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో  పూలే గారికి  నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి ఘనంగా పూలమాలలు అలంకరించి, పూజా కార్యక్రమాలు నిర్వహించి  అందరూ పుష్పాలతో అభిషేకించి  వారికి నివాళులు అర్పించారు. 

 ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే గారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క దిశ నిర్దేశాలను, బలహీన బడుగు వర్గాలను  ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురా వారి అన్న వారి ఆశయాలను గూర్చి పెద్దలందరూ విశ్లేషంగా తెలియజేశారు. అదేవిధంగా యువతతో కలిసి సామాజిక విప్లవ జోహార్లు తెలియజేశారు.

జ్యోతిరావు పూలే గారి భార్య అయినా సావిత్రిబాయి పూలే గారు బాలికలు, బడుగుల కోసం పాఠశాల ప్రారంభించి, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని . మహిళలు విద్య ద్వారా అభివృద్ధి చెందాలని మహిళలను ఉత్తేజపరిచారని,సమ సమాజ స్థాపనకు, బడుగ, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చోట మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అట్ల పురుషోత్తం గౌడ్, ఏపీ బీసీ చైతన్య సమితి, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలాసాని సాయికుమార్, శ్రీకాళహస్తి పట్టణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మ్యాగీ క్లారా, ఉమాసింగ్, వెంకయ్య, పిల్లారి బత్తినయ్య, పులి రాధాకృష్ణ, కుసుమ గణేష్, జక్కాల దుర్గాప్రసాద్, అట్ల చంద్రశేఖర్, గురు బాబు, మస్తాన్ తదితరులు పాల్గొని వారి యొక్క ఘన నివాళులను తెలియజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad