ఏడు గంగమ్మల జాతర కార్యనిర్వాహకుల సమావేశం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, November 2, 2022

ఏడు గంగమ్మల జాతర కార్యనిర్వాహకుల సమావేశం

ఏడు గంగమ్మల జాతర కార్యనిర్వాహకుల సమావేశం




   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆలయ చైర్మన్: అంజూరు శ్రీనివాసులు

 శ్రీకాళహస్తి పట్టణం రాబోవు ఏడు గంగమ్మల  జాతర  13_12_2022, 14_12_2022 తేదీలలో జరుగు సందర్భంగా అన్ని గంగమ్మల జాతర నిర్వహించు అధ్యక్షులతో మరియు సభ్యులతో  ముత్యాలమ్మ గుడి నందు సమావేశం జరిగినది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగినది. ఈ సమావేశము నందు చర్చలలో భాగంగా గంగామ్మల జాతరకు దేవస్థానము ద్వారా ఏర్పాటు చేయవల్సిన పనులు మరియు సమాకూర్చవలసిన వాటి గూర్చి గంగమ్మ నిర్వాహక సభ్యులు అడిగిన వాటికి  చైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం నుంచి జాతర ఘనంగా నిర్వహించుటకు అన్నీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఏడు గంగమ్మ లతో జాతర నిర్వహించడం మన రాష్ట్రంలో కానీ, మనదేశంలో గానీ ఎక్కడా లేనివిధంగా మన శ్రీకాళహస్తి నందు  నిర్వహించడం మనందరికీ ఎంతో అరుదైన అదృష్టంగా భావిస్తున్నామని, అటువంటి జాతరను చాటింపు ద్వారా ప్రారంభించి ఏడు గంగమ్మల గుడి వద్ద నుంచి గంగమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి పట్టణమునందు భక్తులందరికీ  మొక్కలు తీర్చుకొని మళ్ళీ తిరిగి ఏడు గంగమ్మలు, ఏడు గంగమ్మ గుడి వద్ద నుంచి యధా స్థానాలకు చేరడం అనేది జాతర యొక్క ప్రత్యేకతగా మనం నిర్వహిస్తున్నామని, అటువంటి జాతర గత రెండు సంవత్సరములుగా కోవిడ్ వలన నిర్వహించలేకపోయామని, ఈ ఏడాది ఏడుగంగామ్మల జాతర  శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారి సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించాలని, కావున పట్టణంలో ఏడు గంగమ్మల జాతర నిర్వహించు కార్యనిర్వాహకులు, సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి దేవస్థానం నుండి సారి తీసుకున్న వచ్చే సమయంలో అందరూ కలిసి మంగళ వాయిద్యాలతో  అత్యంత వైభవంగా ప్రతి గంగమ్మ క సారె  అందించే కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. అదేవిధంగా నగిరివీధి నందు గల చాటింపు నిర్వహించు ఏడు గంగమ్మల చాటింపు శిలా బండను నూతనంగా పెద్ద దిమ్మె పై ప్రతిష్టించబోయేలా  ఏర్పాటు చేయబోతున్నామని, ఆదేవిధంగా ముత్యాలగుడి వీధి, ఏడు గంగమ్మల గుడిని కూడా ఈ జాతరలోగానే ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండేలా ముందు ఉన్న కట్టడాలను నిర్మూలించే చర్యలు దేవస్థానం ద్వారా చేపట్టామని , తదనంతరం తరువాయి ఏడాది కల్లా ఏడు గంగమ్మల గుడిని నూతనంగా అత్యంత వైభవంగా ఎంతో పెద్దదిగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నామని తెలియజేస్తూ, జాతర నందు కార్యనిర్వాకులు పట్టణ ప్రజలు యువత, ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జాతర యొక్క విశిష్టతను నలుమూలలవ్యాపింప చేయాలని చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలియజేశారు.

ఈ జాతర నిర్వహణ ఏర్పాట్లు గురించి వ్రాత పూర్వకంగా చైర్మన్ గారికి నిర్వాహకులు సమర్పించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, స్వర్ణ మూర్తి, షన్ము గం, పగడాల రాజు, గణేష్, కొల్లూరు హరి, కార్తికేయన్, బాల గౌడ్, రవశంకర్, ముత్యాల కృష్ణ, విజయ, కిషోర్, మునస్వామి, యువతరం కిషోర్, పాలమంగలం రవి, నాదముని చింతామణి పాండు, కంటా ఉదయ్, గరికి పాటి చంద్ర , హరి ఇతర సభ్యుల పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad