సమ సమాజ సాధనే ధ్యేయం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని సుబ్బానాయుడుకండ్రిగ గ్రామ సచివాలయంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో లింగ వివక్షత పై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వై.యస్.ఆర్.క్రాంతి పథం ఏపియం మునెయ్య మాట్లాడుతూ.....
మహిళలు ఆర్ధికంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నారని త్వరలోనే ఆడ మగ సమానంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సమ సమాజం సాధ్యం చేయాలని కోరారు.
సర్పంచ్ సుబ్బమ్మ మాట్లాడుతూ.... ప్రభుత్వం మహిళలు కు అన్ని రంగాలలో సహాయం చేస్తున్నదని సర్పంచ్ లలో కూడా అత్యధికంగా మహిళలు ఎంపిక కావడం జరిగిందని తద్వారా లింగ వివక్షత రూపు మాపాలని తెలియ చేశారు.
పంచాయతీ కార్యదర్శి భానుప్రియ మాట్లాడుతూ.... దేశంలోనే అత్యున్నత స్థాయి కలిగిన రాష్ట్రపతి పదవి మహిళ ఐన శ్రీమతి ద్రౌపది ముర్ము గా ఎంపిక కావడం మహిళలు సాధించిన విజయం అని అలాంటిది లింగ వివక్షత నిర్మూలన చేయడం మహిళలుకు పెద్ద కష్టమైన పని కాదని ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది మరియు పారా లీగల్ వాలంటరీ, విఓఏ ఆదినారాయణ రెడ్డి మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment