మూడు లక్షల దీపాలతో శివలింగ దీపార్చన
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
లోక కళ్యాణార్థం పరమేశ్వరుని అనుగ్రహం కోసం దీపారాధన:
చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు లక్షల దీపాలతో శివలింగ దీపార్చన వేదో యుక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణం, సమస్త భక్తుల శ్రేయస్సుని ఆశిస్తూ శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కోటి సోమవారాల పర్వదినాన్ని పురస్కరించుకొని తన సొంత నిధులు వెచ్చించి శ్రీకాళహస్తి ఆలయంలో శివలింగ దీప అర్చన కార్యక్రమాన్ని నిర్వహింప చేశారు. ఆలయంలోని నటరాజ స్వామి వద్ద విశ్రాంతి ఉపాధ్యాయులు స్వర్ణ మూర్తి సహకారంతో శివలింగాకృతి ని పుష్పాలతో అలంకరించి స్వచ్ఛమైన నేతి దీపాలను 800 ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో 365 దీపాలను మొత్తం మీద మూడు లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీమతి వాణిమ్మ విచ్చేసి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, జాహ్నవి దంపతులతో కలిసి శివలింగ దీపార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రోచనాలు నడుమ దీపు పూజ చేయించి శివలింగ దీపార్చన కార్యక్రమాన్ని వేదోయుక్తంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు దంపతులు, వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ దంపతులు, డిప్యూటీవో కృష్ణారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అధికారులు, భక్తులు ఎంతో భక్తి ప్రభక్తులతో శివలింగ ఆకృతిలోని దీపాలను వెలిగించి హర హర మహాదేవ శంభో శంకర అంటూ స్వామి నామస్మరణ చేశారు.. పుణ్య దినాన శివనామస్మరణలతో శ్రీకాళహస్తి ఆలయం మారుమరోగింది. శివలింగ దీపార్చన కాంతుల వెలుగుల్లో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది.. భక్తులు కార్తిక దీపాలను ఆధ్యాత్మిక ఆనందంతో తిలకించి పరవశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి బోర్డు సభ్యులు సాధనం మున్న,జయశ్యామ్, కొండూరు సునీత,లక్ష్మీ, రామప్రభ, ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులు చింతామణి పాండు, శ్రీదేవి, మరియు వెంకటసుబ్బయ్య కొండూరు నంద, లక్ష్మీపతి హరి,మొగరాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment