ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పట్టణంలోని బృందమ్మ కాలనీలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్, ఎంజీఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కామేష్, ఎంజీఎం హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన గుండె, ఎముకలు, చిన్నపిల్లలు, జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు శిబిరంలో పాల్గొంటారనీ, బృందమ్మ కాలనీవాసులతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందాలని కోరారు.
No comments:
Post a Comment