రాస్ మరియు టాటా ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, January 6, 2023

రాస్ మరియు టాటా ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

 తొండమనాడు గ్రామం లో రాస్  మరియు టాటా ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం 


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కీ. శే. పద్మ శ్రీ డాక్టర్ గుత్తా మునిరత్నం గారి 87 వ జయంతి ని పురస్కరించుకొని తొండమనాడు గ్రామములో గల రాస్ వృద్ధాశ్రమం నందు రాష్ట్రీయ సేవా సమితి పొదుపు సంఘాల సభ్యుల సౌకర్యార్థం, టాటా ట్రస్ట్ వారిచే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న గ్రామ సర్పంచ్ హేమభూషన్ రెడ్డి గారిచే వైద్య శిభిరాన్ని ప్రారంభించడం జరిగింది. హేమభూషణరెడ్డి గారు మాట్లాడుతూ మునిరత్నం గారు మానవ సేవయే మాధవ సేవ అని భావించి రాస్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం తో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పొదుపు సంఘాల ద్వారా చేతివృతులు నేర్పించి వారి కుటుంబాలలో వెలుగులు నింపారు, ఈరోజు రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి సహకారంతో గ్రామీణ ప్రాంతంలో ని మహిళలకు ఉచితంగా వైద్యసేవలను అందిస్తూ, వారి యొక్క ఆరోగ్యం పై అవగాహన కల్పించడం అభినందనీయమని తెలియజేసారు.

ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న 177 మంది మహిళలు మరియు పురుషులకు నోటి క్యాన్సర్ ,రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్,  బిపి , హెపటైటిస్, షుగర్ లకు సంబంధించిన పరీక్షలు  డాక్టర్ల బృందంచే , ముందుస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం , ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన రావడం జరిగింది.ఈ కార్యక్రమం  నందు  భక్తవత్సల రెడ్డి గారు, టాటా ట్రస్ట్ డాక్టర్ భార్గవ్,మెహతాజ్, రెడ్డి కుమారి, శివ, చైతన్య, మధుసూదన్,రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ,ఫీల్డ్ అధికారి సుబ్బారావు,మురళీకృష్ణ అనిమేటర్లు పల్లవి, విజయలక్ష్మి,జ్యోష్ణ, స్వరూప, హిమబిందు, నాగలక్ష్మి ,జయలలిత, జయంతి, గౌతమి, హోం  సూపర్ వైజర్ కందప్ప రెడ్డి,క్లస్టర్ లీడర్లు, ఆశా వర్కర్లు,సిబ్బంది  తదితరులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad