మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యా ప్రదాత సావిత్రి బాయి పూలే -చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, January 3, 2023

మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యా ప్రదాత సావిత్రి బాయి పూలే -చక్రాల ఉష

 మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యా ప్రదాత సావిత్రి బాయి పూలే-చక్రాల ఉష







   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యా ప్రదాత, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు సావిత్రి బాయి పూలే అని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. తొట్టంబేడు మండలం శివనాధపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. మొదట సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు అరుణ, ధనమ్మ, గాయిత్రి, విజయశ్రీ, జ్యోతి, ప్రియ, మంజు భార్గవిని సన్మానించి చిత్ర పటాలు బహుకరించారు విద్యార్థినీ విద్యార్థుల చేత గురువులకు పాద పూజ చేయించారు 

ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ... జ్ఞాన సముపార్జన ద్వారానే మానవుడు ఉన్నత స్థితిని సాధిస్తాడనే సావిత్రిబాయి ఫూలే సూక్తి ద్వారా మనమంతా ప్రేరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం నిషిద్ధం అని చెబుతున్న రోజుల్లోనే తన భర్త జ్యోతిరావు పూలే ప్రోద్బలంతో సావిత్రిబాయి పాఠశాలలో చేరారన్నారు. విద్యార్థిగా ఉంటూ తన భర్త ఇచ్చిన నల్లజాతీయులు మానవహక్కుల పోరాటయోధుడు థామన్ క్లార్క్‌సన్ ఉద్యమ చరిత్ర"ను చదివి తద్వారా స్ఫూర్తి పొందిన ఆమె మానవహక్కుల పోరాటయోధురాలిగా మారారన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కూడా ఆమె ఎంతో కృషి చేశారని చక్రాల ఉష  చెప్పారు. ఆమె సంఘ సంస్కర్తగా భర్త జ్యోతిభాపూలే మరణించిన సమయంలో తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారని చెప్పారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన సావిత్రిబాయి పూలేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరుకున్నారు. మహిళా ఉఫాద్యాయులను సన్మానించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్ని వృత్తుల్లోకి ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైనదని  అందులో మహిళ ఉపాధ్యాయులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విద్యార్థుల ఉన్నత భవిత కు ఎంతో కృషి చేస్తారని అటువంటి గురువులను జీవితంలో ఎప్పుడూ మరవకూడదని విద్యార్థినులకు తెలియజేసారు

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగసత్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad