గ్రామీణ నివాసాల వద్దకే కార్పొరేట్ వైద్యం:MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి వి. యం పల్లి లో ఆదివారం MGM హాస్పిటల్స్ మరియు ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దాదాపు 250 మంది ఈ వైద్య శిబిరం లో పాల్గొని వారి ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ వారు, MGM హాస్పిటల్స్ వారు శ్రీకాళహస్తి మరియు చుట్టు ప్రక్క గ్రామాల ఆరోగ్య దృష్ట్యా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం ఆనందం గా వున్నదని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కామేష్ తెలిపారు. MGM హాస్పిటల్ వారు ఉచితం గా మందులు కూడా పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ MGM హాస్పిటల్స్ వారు చేపట్టే ఈ వైద్య శిబిరానికి ప్రెస్ క్లబ్ వారి సహకారం ఉండడం,చాలా సంతోషం అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రెస్ క్లబ్ వారి కోరిక మేరకు ఎన్ని వైద్య శిబిరాలు చేపట్టే దానికైనా మేము సిద్ధంగా ఉంటామని, అలాగే MGM హాస్పిటల్ నందు 24 గంటలు డాక్టర్ లు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో MGM హాస్పిటల్స్ డాక్టర్ వివేక్ చైతన్య (గుండెవైద్య నిపుణులు), డాక్టర్ తేజస్విని (జనరల్ మెడిసిన్ ), డాక్టర్ శివకిషోర్ (జనరల్ సర్జన్ ), *డాక్టర్ ఉమామహేశ్వర్ రావు (చిన్నపిల్లల వైద్య నిపుణులు) గార్లు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment