సాధువులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ చైర్మన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సాధువులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించి పంపిణీ చేశారు.
శ్రీకాళహస్తిలోని శ్రీ స్వయంభు లింగస్వామి ఆశ్రమంలో నిరాశ్రయులైన సాధువులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తీశ్వర పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి, తొలుత ఆశ్రమంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వయంభు లింగస్వామి చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం నిరుపేద సాధువులకు దుప్పట్లు పంపిణీ నీ చైర్మన్ అంజూ రు శ్రీనివాసులు ప్రారంభించి పంపిణీ చేశారు. స్వయంభు లింగస్వామి నిత్య అన్నదానం తో పాటు పేదలకు నిరాశ్రయులకు వివిధ రకాల చేయూత ఇస్తూ అండగా నిలవడం అభినందనీయమన్నారు. మానవుడు లో మాధవడిని చూస్తూ తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వయంభు లింగస్వామి సేవలు నిరూపమానం అని అంజూరు శ్రీనివాసులు కొనియాడారు. మనం చేసే సేవలే సర్వేశ్వరుని మోక్షానుగ్రహం లభించడానికి మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధువులు మరియు భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment