అన్ని వర్గాల ప్రజలు జరుపు కొనే అద్వితీయ మైన పండుగ : విద్యార్థులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
హిందు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబాంబిస్తూ, అన్ని వర్గాల ప్రజలు జరుపు కొనే అద్వితీయ మైన పండుగ అని స్టయింట్ జేవీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని స్టయింట్ జేవీయర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి.
సంక్రాంతిని పురస్కరించుకుని స్టయింట్ జేవీయర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు,సంప్రదాయ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యాపకులు సిస్టర్ శిర్లీ మరియు విదార్థులు పాల్గొన్నారు.
పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ శిర్లీ మాట్లాడుతూ..... సంక్రాంతి అనేది రైతుల కృషి ఫలితంగా పంటలు చేతికి అందడంతో ఆనందోత్సహాలతో జరుపుకుంటారని అన్నారు. విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగ్గులు వేయడం వలన కలిగే ఆరోగ్య పరమైన కళాత్మక విషయాలు గురించి, భోగి పండగ ఉపయోగాల గురించి వివరించారు. అలాగే సంక్రాంతి పండుగ అనేది హిందువులకు ముఖ్య పండుగ , అన్ని వర్గాలవారు జరుగుకొనే పండుగ. విద్యార్థులకు మతాబేదం లేకుండా అందరూ కలిసికటుగా ఉండాలని అన్నారు
No comments:
Post a Comment