మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన తల్లిదండ్రుల కమిటీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ నందు ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ. ఈ కార్యక్రమంలో జడ్పీ బాయ్స్ హై స్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్, మరియు కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రెసిడెంట్ ఆర్కాట్ శంకర్ మాట్లాడుతూ.... గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రతిష్టాత్మకమైన పథకం మధ్యాహ్న భోజన పథకం లో విద్యార్థులకు పౌష్టికాహార అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం మరియు గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి యొక్క ఆలోచన, దానికి అనుగుణంగా ఈరోజు మా కమిటీ సభ్యులంతా మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి చూశారు, అనంతరం విద్యార్థులను ప్రతిరోజు ప్రభుత్వం తెలిపిన మెనూ ప్రకారం అందిస్తున్నారా... లేదా, రుచి, పరిశుభ్రత పై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో మేము భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు
No comments:
Post a Comment