శ్రీ కాళహస్తి "భాష్యం హై స్కూల్"లో ఘనంగా "ముందస్తు సంక్రాంతి వేడుకలు"
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ కాళహస్తి పట్టణం భాష్యం హై స్కూల్ లో జోనల్ ఇన్చార్జ్ యల్.లక్ష్మణ్ రావు గారి ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ వై. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథిలు గా DSP VISWANATHA ,ట్రాఫిక్ CI వెంకటప్ప విచ్చేసి విద్యార్థులను ఉద్దెసించి మాట్లాడుతూ , విద్యార్థులు అందరూ కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా అందరూ బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయిక వస్త్రాలను ధరించి, ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో అందరినీ అలరించారు.ఈ కార్యక్రమం లో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గులపోటీలు మరియు వంటచేయకుండా పౌస్తిక ఆహారం తాయారు చేయడం వంటి పోటీలు నిర్వహించారు.ముక్య అతిధులు చేత బహుమతి ప్రధానం చేసారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అందరూ పాల్గొని పండగ వాతావరణంతో అలరించారు.
No comments:
Post a Comment