ముక్కంటిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు గుంటూరు ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు గుంటూరు ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం గారికి విచ్చేశారు. దక్షిణ గాలిగోపురం వద్ద శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ, స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవారి తీర్థప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ A.E.O సతీష్ మాలిక్, ఆలయ టెంపుల్ శ్రీనివాసరాజు,సుదర్శన్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment