పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడండి : కమిషనరు శ్రీకాళహస్తి పురపాలక సంఘము
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పురపాలక సంఘము నందు సచివాలయ అడ్మిన్ సెక్రటరీలతో పి. వెంకట రమణ, కమిషనరు(యఫ్.ఎ.సి.) సమీక్షా సమావేశము నిర్వహించడమైనది. సదరు సమావేశము నందు కమిషనరు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణము నందు ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, ఖాళీ జాగా పన్నులు వగైరా పన్నులు బకాయిలు చెల్లించుటలో చాలా తక్కువ శాతముగా వున్నదని గుర్తించి సదరు పన్నుల వసూళ్లు వేగవంతము చేసి 100% పన్ను వసూళ్లు చేయాలని సూచించారు. అంతే కాకుండా ప్రజలను కూడా చైతన్యవంతుల్ని చేసి పన్నులు సకాలములో చెల్లించే విధముగా సచివాలయ సిబ్బంది మరియు వార్డు వాలంటీర్లు చర్యలు చేపట్టాలని తెలియయడమైనది. అలాగే కొళాయి పన్నులు అధికముగా ఉన్న పన్నుదారులకు కొళాయి కనెక్షన్ ను తొలగించడము జరుగుతుందన్నారు. పన్నుదారులు కేవలము మార్చిలోనే చెల్లిస్తామని చెబుతున్నారని, కానీ అప్పటికే వడ్డీ జమ కాబడుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సకాలములో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు.
సదరు సమావేశము నందు ఆర్.ఓ. పి.యం.వి. నారాయణ రెడ్డి, మేనేజర్ బి. ఉమా మహేశ్వర రావు, టి.పి.ఓ. మధుసుధన, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పి. రవికాంత్, బి. బాల చంద్రయ్య, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment