శ్రీ మేధా గురుదక్షిణామూర్తి అభిషేకం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న శ్రీ మేధా గురుదక్షిణామూర్తికి గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామి వారికి ఆలయ అర్చకులు కరుణాకరన్ గురుకుల్ గురుదక్షిణ మూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద కలిసా ప్రతిష్ట ఏర్పాటు చేసి వినాయకుని పూజ, కలిసా పూజ పలు వైదిక క్రతువులను వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు.అనంతరం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి పాలు,పెరుగు, పంచామృతం, చందనం, నారికేళ్ల జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. తదుపరి దక్షిణామూర్తి స్వామి వారికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలు మరియు స్వర్ణ ఆభరణాలతో శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామివారిని శోభమయంగా అలంకరించి విశేష పూజలు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రాలు మధ్య స్వామివారికి 108 దీపాలు పర్వత హారతి,చక్ర హారతి కుంభహారతి మహా మంగళ హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
No comments:
Post a Comment