అన్నదాతలకు యూరియాని అందుబాటులోకి తీసుకురావాలి :రైతు ఉపాధ్యక్షులు ప్రకాష్ నాయుడు
ప్రకాష్ నాయుడు |
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రైతులకు యూరియా,పొటాష్,పాస్పరస్ వంటి ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరుపతి పార్లమెం ట్ టీడీపీ రైతు ఉపాధ్యక్షులు ప్రకాష్ నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు . .పేడ,దిబ్బ ఎరువులు ఎంత వాడినా రసాయనిక ఎరువులు వాడకుంటే పంట దిగుబడి గణనీయంగా తగ్గి రైతులు అపార నష్టాన్ని చవిచూస్తున్నారని వాపోయారు.రైతులకు సాగునీరుపుష్కలంగావున్నాఎరువులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.యూరియా కోసం రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరలు వెచ్చించి తెచ్చుకుంటా వున్నారన్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం ఆర్ బీ కే లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు.అలాగే చీడపీడలు నివారణకు పురుగుమందులు కూడా దొరక్క రైతులు పంటలపై ఆశలు వదులుకుంటున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నదాతలకు అన్ని రకాలైన సబ్సిడీలు అందించిందిందని , కానీ నేడు ఏ ఒక్క రైతుకు కూడా సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేయడం లేదని ధ్వజమెత్తారు . ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి అన్నదాతలకు ఎరువులు,పురుగు మందులు రైతులకు అందేలా చూడాలని డిమాండ్ చేశారు .
No comments:
Post a Comment