దర్గా ను దర్శనం చేసుకొన్నా ఆంధ్రప్రదేశ్ కుంఫు ఫైట్ మాస్టర్ రాఘవ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, January 6, 2023

దర్గా ను దర్శనం చేసుకొన్నా ఆంధ్రప్రదేశ్ కుంఫు ఫైట్ మాస్టర్ రాఘవ

 దర్గా ను దర్శనం చేసుకొన్నా ఆంధ్రప్రదేశ్ కుంఫు ఫైట్ మాస్టర్ రాఘవ



   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లు లో వెలసిన జుంలేశ పీర్ దర్గా ను దర్శనం చేసుకొన్నా ప్రముఖ ఆంధ్రప్రదేశ్ కుంఫు ఫైట్ మాస్టర్ రాఘవ. వీరికి దర్గా నిర్వాహకులు స్వాగతం పలికి దర్గా  ప్రత్యేక పూజలు జరిపి తదుపరి దుశాల్వా పూలమాలతో దర్గ కమిటీ సభ్యులు సత్కరించారు . దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు తర్వాత మన రాష్ట్ర కుంఫు అసోసియేషన్ ను  తిరుపతి జిల్లా  మరియు శ్రీకాళహస్తి పట్టణ కమిటీ ఏర్పాటు చేయుటకు చర్చించారు. 

దర్శనం అనంతరం తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్  ఎస్ పి చక్రవర్తి ఐ ఏ ఎస్ఎ గారిని  కలిసి జిల్లా కమిటీ గురించి చర్చించారు.

ఈ కార్యక్రమములో దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, సభ్యులు జమ్రుద్ బాషా, రాజేశ్వర రావు, గరికపాటి రమేష్, నాగేశ్వర రావు, భావజాన్, జుంలేశ, మొహమ్మద్ ...మొదలైనవాలు పాల్గొన్నారు 

ఫైట్ మాస్టర్ రాఘవ మాట్లాడుతూ......దర్గా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే  కున్పు నేర్చుకోవటం వాళ్ళ ఆత్మ రక్షణ  మరియు శారీరక, మానసికంగా బలంగా ఉండాలని,  ఇప్పుడు ఉండే పరిస్థితులలో మనిషి చాలా బలహీనంగా తయారవుతున్నారని ఇందుకు విరుద్ధంగా మనము మానసిక, శారీరక శక్తి సంపాదించాలంటే ఇలాంటి మార్సియల్ ఆర్ట్స్ మరియు మెడిటేషన్ ద్వారా ప్రయత్నాలు సాగించాలని మాస్టర్ తెలిపారు .  కాబట్టి చిన్న పిల్లలు స్కూల్లో నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. అతి త్వరలో మా గ్రాండ్ మాస్టర్ సీజో, వ్యవస్థాపకుడు రవికుమార్ గారు  వస్తున్నారని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎస్పీలు రాజాసికామని. చక్రపాణి ... తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని, నేను గత 14 సంవత్సరాలుగా పోలీస్ వారికి ఆత్మరక్షణకు కూన్ఫు  ట్రైనర్  ఇస్తున్నానని తెలిపారు . కాబట్టి మా కాళహస్తిలో ఉన్న పట్టణ ప్రజలు ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad