శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేత చంగల్వరాయ స్వామి వారికి వెండి ఉరువులు అందజేశారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేత చంగల్వరాయ స్వామి వారికి హైదరాబాద్ వాస్తవ్యులు అజస్ర హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అధినేత ఎన్. రామకృష్ణ రావు మరియు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీవల్లి దేవసేన సమేత చంగల్వరాయ స్వామి వారికి వెండి ఉరువులు విరాళంగా అందజేశారు సుమారు దీని విలువ 18,30,000 వారికి ఆలయ ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం అభిషేక గురుకుల్ రాజేష్ గురుకుల్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు దాము, పరిచారకులు మహేష్, మారి దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*
No comments:
Post a Comment