దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ మిద్దెల హరి .......
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మిద్దెల హరి యువసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన Dr BR అంబేడ్కర్ గారి 132జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన మాజీ ఆప్కో డైరెక్టర్,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ మిద్దెల హరి అనంతరం మిద్దెల హరి మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ దేశానికి గర్వ కారణమని,చురుకైన సంఘసంస్కర్తగా, ప్రముఖ న్యాయవాదిగా చిరస్మరణీయుడని అంతే కాదు ప్రపంచమే గర్వించదగ్గ మహా మేధావి, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలోనే ఆయన జయంతి వేడుకలు అధికారికంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లో 5మంది దళిత మంత్రులు, ఒకరు గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో దళిత,గిరిజన నుండి ఉప ముఖ్యమంత్రిలను నియమించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే . దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దళితుల ఉన్నత చదువు కోసం విదేశీ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కొత్త సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్మడి బాలకృష్ణయ్య మాట్లాడుతూ ఈరోజు దళిత,గిరిజన, బడుగు బలహీన వర్గాల చెందినవారు M.L. A, MP లు అయ్యారంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అంతేకాకుండా సమాజంలో ఉన్న అసలైన పేదలతో పాటు ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులు దక్కేల అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కలిమిలి. వెంకటరమణయ్య, గున్నేరి మధుసూదన్ రెడ్డి, ఇసుకమట్ల బాల, గంజి వెంకటేష్, దావాల గిరి, C. సుధ, S. సుధా, D. వెంకటయ్య, చెన్నయ్య, N. వెంకటేష్, D సురేష్, A జయ కుమార్, గాంధీ,D. శివ,సోము, గురునాథం, రామయ్య, లోకయ్య, శేషయ్య,D బాబు,M శ్యామ్, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment