జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం
ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. నెల్లూరు నగరం 50వ డివిజను పరిధిలో గల సంతపేటలో మంగళవారం ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష, రేవతి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా చేశారు. ఈ సందర్భగా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులను సన్మానం ( కప్పిర శ్రీనివాసులు సంఘ సంస్కర్త, ఉపాధ్యాయులు వేణు, హాసిఫ్, అ లలిత MV లలిత ), చేశారు. అదేవిధంగా విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ... మహాత్మా జ్యోతిరావ్ ఫూలే బడుగు బలహీన అణగారిన వర్గాల అభివృధికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా స్త్రీ విద్యకోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు అసమానతలు తొలగించడానికి ఎంతో కృషి చేశారన్నారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఆయన పని చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే జీవితం ఈ దేశ ప్రజలకు ఆదర్శమని... వారి ఆశయాన్ని మనమందరం ముందుకు తీసుకుపోవడమే వారికిచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం, లాజర్, ప్రభాకర్ దాసు, శ్రీను, బెన్ని, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment