ఉషోదయఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం : చక్రాల ఉష - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, April 22, 2023

ఉషోదయఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం : చక్రాల ఉష

ఉషోదయఫౌండేషన్   ఆధ్వర్యంలో  చలివేంద్రం :   చక్రాల ఉష





     స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


వేసవికాలం మొదలవుతున్న సందర్భంగా బాటసారుల దాహాన్ని తీర్చేందుకు  ఈ రోజు పట్టణ నారద పుష్కరిణి వద్ద  ఉషోదయఫౌండేషన్  అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో *చలివేంద్రం ప్రారంభించడం జరిగింది


 మొదటిరోజు సందర్భంగా మజ్జిగ వివిధ రకాల జ్యూస్లు బాటసారులకు ప్రయాణికులకు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని  బస్ స్టేషన్కు వెళ్తున్న భక్తులకు భక్తులకు ఇవ్వడం జరిగింది

 ఈ సందర్భంగా  చక్రాల ఉష మాట్లాడుతూ వేసవి తాపం ఎక్కువ అవుతున్న కారణంగా  బాటసారులకు ప్రయాణికులకు  భక్తులకు నీరు అందివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని  ఒకప్పుడు బావులు చెరువులు నదులు విరివిగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కడపడితే అక్కడ స్వచ్ఛమైన నీరు అందేదని ఇప్పటి కాలంలో మానవ తప్పిదాల వల్ల   మనుషులందరూ స్వార్థంతో  చెరువులు బావులు నదులు  లేకుండా చేసేసిన కారణంగా  నీటి సమస్య ఏర్పడటం  ఈ రోజుల్లో డబ్బు పెట్టి నీరు కొనుక్కునే దౌర్భాగ్యస్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

 ఈరోజు ధరిత్రిదినోత్సవాన్ని కూడా గుర్తు చేశారు ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని ఈ భూమి మీద మనతో పాటు సకల జీవరాసులు కూడా బ్రతికే అవకాశం మనం కల్పించాలని స్వార్థ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా అడవులను స్వాహా చేయడం వల్ల అడవుల్లో నివసించే క్రూర మృగాలు సైతం పట్టణాల మీద పడుతున్నాయని , కాంక్రీట్ జీవనంలో  పెరిగే జనాభా కి విరివిగా బిల్డింగులు కడుతున్నారే తప్ప విరివిగా మొక్కలు నాటడం లేదని  ఈ కారణంగా రాబోవు రోజుల్లో   పీల్చుకునే గాలి కూడా కొనేరోజులు వస్తాయని ఈ విషయాల మీద ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని విరివిగా మొక్కలు నాటి  స్వచ్ఛమైన వాతావరణం మన భావితరాల కు  అందివ్వాలని, ప్లాస్టిక్ ని వీలైనంతవరకు నిషేధించాలని  కోరారు


 ఈ కార్యక్రమంలో ఉషోదయ ఫౌండేషన్ సభ్యులు చక్రాల మురళీ మహేష్  జ్ఞానేష్  యుగంధర్  నవ భారత యువజన సంఘ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు, కేశవ  రాజా లోకేష్ తదితరులు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad