రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి ముస్లిం కుటుంబాలకు MLA షాదీ మహల్ కానుక
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
¶ ₹4,000,000/- లక్షలు తన సొంత డబ్బుతో షాది మహల్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.
¶ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల సమక్షంలో మత గురువులకు మరియు కమిటీ సభ్యులకు ముందుగా ₹2,00,000/- లక్షలు అందజేత.
¶ రంజాన్ పర్వదినాన ఎమ్మెల్యే కానుకకు హర్షం వ్యక్తం చేసి ఆశీర్వదించిన ముస్లిం మత పెద్దలు మరియు సోదరులు.
శ్రీకాళహస్తి పట్టణం, ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న మక్కా మసీదుకు సంబంధించిన ఈద్గా వద్ద నూతన షాదీ మహల్ నిర్మాణానికి సహృదయంతో సాయం అందించి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
షాది మహల్ నిర్మాణానికి 40 లక్షలు ఖర్చు అవుతుందని మత పెద్దలు మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారికి తెలియజేయడంతో స్పందించిన ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బు ₹4,000,000/- లక్షలతో షాదీ మహల్ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి అందులో భాగంగా ఈరోజు ₹2,00,000/- లక్షలు అందజేశారు.
రంజాన్ పర్వదినాన ఎమ్మెల్యే కానుకకు హర్షం వ్యక్తం చేసి ఆశీర్వదించిన ముస్లిం మత పెద్దలు మరియు సోదరులు.
ఈ కార్యక్రమంలో ఒక బోర్డ్ చైర్మన్ సిరాజ్ భాష, పిండి మిల్లు ఖాదరభాష,rk భాయ్,mim అన్వర్,ఆబిద్,పఠాన్ ఫరీద్, ఫజల్, అమీర్, నిషారహమద్,బషీర్, జిమ్ కరిముల్లా మరియు ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment