MGM హాస్పిటల్స్ నందు అగ్నిమాపక అవగాహనా కార్యక్రమం. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, April 19, 2023

MGM హాస్పిటల్స్ నందు అగ్నిమాపక అవగాహనా కార్యక్రమం.

 MGM హాస్పిటల్స్ నందు అగ్నిమాపక  అవగాహనా కార్యక్రమం.     


    స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


   అగ్నిమాపక  వారోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీకాళహస్తి అగ్నిమాపక  సిబ్బంది MGM హాస్పటల్స్ నందు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 100 మంది MGM హాస్పిటల్స్ సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో హాస్పిటల్ సిబ్బంది పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రతల గురించి అగ్నిమాపక  సిబ్బంది చాలా బాగా వివరించారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ  అగ్నిమాపక  సిబ్బంది వారు నిర్వహించిన ఈ కార్యక్రమం మా MGM హాస్పిటల్స్ సిబ్బందికి చాలా అవసరమని  హాజరైన అగ్నిమాపక  సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad