జ్యోతిరావు పూలే ఆశయాలు నెరవేర్చే దిశగా నరేంద్ర మోడీ పాలన.డాక్టర్ చంద్రప్ప.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఓబిసి జిల్లా అధ్యక్షుడు BD బాలాజీ సూచనలతో ఓబిసి జనరల్ సెక్రటరి గోపి ఆచారి అద్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓ బి సి తిరుపతి జిల్లా నాయుడుపేట నందు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్చార్జి వహించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రప్ప నాయుడుపేట పట్టణ బిజెపి అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు,సీనియర్ నాయకులు రంగినేని కృష్ణయ్య, రామయ్య,నాయకులతో కలిసి ముందుగా మహాత్మ జ్యోతి రావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చాలి జ్యోతిరావు పూలే జిందాబాద్ అంటూ నినాదాలు చేసి బిజెపి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ అట్టడుగు స్థాయి వర్గాల వరకు సంక్షేమ ఫలాలు అందే విధంగా ఉత్తమ పరిపాలన అందిస్తూ ప్రపంచ దేశాలలోనే గర్వించతగ్గ నాయకుడు అయ్యాడని మహాత్మ జ్యోతిరావు పూలే అన్ని వర్గాల చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు అని ఆయన అన్నారు.ఈకార్యక్రమం లో ఓబిసి నాయకులు నీలకంఠమురళి, వెంకయ్య గౌడ్, గోపాల్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment