శ్రీకాళహస్తి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించారు. తొలుత అగ్నిమాపక వీరుల సంస్మరణ దినం సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. *అనంతరం అగ్నిమాపకం పై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు గోడపత్రికలను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆవిష్కరించారు. దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు నేటి నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని వారం పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అగ్ని కీలకల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తూ ప్రాణాలు కాపాడుతూ ఆస్తి నష్టం తగ్గించేలా వారి చూపించే సాహసంతమైన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఇన్చార్జి నాగార్జున రెడ్డి, ఫైర్ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు పీఎం చంద్ర, నరసింహులు, చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment