మహాత్మ జ్యోతిరావు పూలే కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మిద్దెల హరి యువసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతీ రావు పూలే గారి 197 జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన మాజీ ఆప్కో డైరెక్టర్,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ మిద్దెల హరి
మహాత్మ జ్యోతిరావు పూలే 197 జయంతి సందర్భంగా 4th ఏనుగుల గుంట యందు నివాసం ఉంటున్న కాకి దీప, అజయ్ కుమారుడు కాకి ఓంకార్ పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసి వెంటనే ఆ బాలునికి 5000 రూపాయలు తన వంతు సాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ సామాజికవేత్తగా, సంఘసంస్కర్తగా, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి నవ సమాజ స్థాపన కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి మహాత్మా పూలే అని, అంతేకాకుండా అణగారిన వర్గాల వారంతా విద్యావంతులు కావాలని ఆశించిన మహాత్మ జ్యోతిరావు పూలే మాత్రమే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కార్పొరేషన్లు, విద్య,ఆరోగ్యము లాంటి అనేక పథకాలును ప్రవేశ పెట్టి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇసుకమట్ల బాల, గంజి వెంకటేష్, తీగల చిన్న, దావల గిరి, సుధాకర్,నున్న సుధా, ప్రభాకర్, చెన్నయ్య,వాసు,లక్ష్మయ్య, వెంకటేష్,గురునాథం, లోకయ్య, రామయ్య, నారాయణ, గాంధీ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment