అంబేద్కర్ ఆశయ సాధకులవుదాం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కులం కంచెను చేధించి, మతం గోడను పెకలించి నిమ్న జాతులను అంటరాని తనం, సామాజిక రుగ్మతల నుంచి బయటపడేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధకులుగా నేటితరం నిలవాలని పలువురు పాత్రికేయులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధకులుగా జర్నలిస్టుల సైతం వ్యవహరించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏ.కామేష్ పిలుపునిచ్చారు. సీనియర్ పాత్రికేయులు ఎంవి రమణ, ఈశ్వరయ్య, రవి, రఫీ, శీను, ఎన్ హరిబాబు, వీసీ వెంకటయ్య, బత్తెయ్య, మునికృష్ణారెడ్డి, యాసిన్, బాలసుబ్రమణ్యం, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment