పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిద్దాం! పోలియో రహిత భారతాన్ని నిర్మిద్దాం!!
శ్రీకాళహస్తి పురపాలక సంఘమ నందు పల్స్ పోలియో కార్యక్రమము తేదీ: 27.02.2022 నుండి 01.03.2022 వరకు నిర్వహించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చిన ఆదేశముల మేరకు, శ్రీకాళహస్తి పట్టణములో 0-5 సంవత్సరములు లోపు పిల్లల సంఖ్య 9,525 ఉన్నందున, పట్టణములో మొత్తము 51 పోలియో కేంద్రములు (అన్ని ప్రభుత్వ పాఠశాలల యందు ) ఏర్పాటు చేయటము జరిగినది. అలాగే ట్రాన్సిట్ కేంద్రములు రైల్వే స్టేషన్ , బస్సు స్టేషన్ మరియు దేవస్థానము నందు ఏర్పాటు చేయడము జరిగినది. మొబైల్ టీములు 2 ఏర్పాటు చేయడము జరిగినది.
కావున శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు అందరూ సహకరించి 0-5 సంవత్సరముల లోపు పిల్లలకు తప్పనిసరిగా మీకు దగ్గరలోని పల్స్ పోలియో కేంద్రములలో పోలియో చుక్కలు వేయించి ఈ పోలియో వ్యాధిని కలిగించే వైరస్ ను సమూలంగా నిర్మూలించవలసినదిగా తెలియజేయడమైనది.
కమీషనర్, శ్రీకాళహస్తి పురపాలక సంఘము
No comments:
Post a Comment