విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరిన డాక్టర్ ప్రమీలమ్మ
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం లోని పెద్ద కన్నలి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివే సుమారు 80 విద్యార్థులకు రాబోయే పరీక్షలు బాగా రాయాలని కోరుతూ వారికి పరీక్షలకు సంబంధించి పరీక్ష సామగ్రి (పాడ్ , పెన్, పెన్సిల్, ఎర్రిసెర్, మెండేర్,స్కేల్,జామెండ్రి బాక్స్..మొదలైనవి) ఉచితంగా అందించారు.
డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ.... మా మామ గారు అయినటువంటి కన్నలి చిన్న రామ్ రెడ్డి గారి కట్టించిన ఆ స్కూల్ నందు ఆయన జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరము 10 క్లాస్ విద్యార్థులకు ఉచితముగా పరీక్ష సామాగ్రి అందించడం ఆనవాయితీ, దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారు 80 మంది విద్యార్థులకు పరీక్షలకు పరీక్ష సామాగ్రి లు అందించడం జరిగింది. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ శ్రీకాళహస్తీశ్వరుని కోరుచున్నాను అని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ మరియు పాఠశాల అధ్యాపకులు, స్టెప్స్ సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment