రాబోయే శివరాత్రికి బాల్యవివాహలు నిర్ములనకు ప్రతిఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి అరుణ గారు
రాబోయే శ్రీకాళహస్తి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి
పట్టణంలోని కోర్ట్ సముదాయం లో అన్ని శాఖల వారితో సమావేశం జరిగినది. ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి అరుణ , డి ఎస్ పి విశ్వనాధ్ , తసీల్ధార్ జరీనా , శ్రీకాళహస్తి సి డి పి ఓ శాంతి దుర్గ, తొట్టంబేడు సిడిపిఓ ఫర్జానా , దేవస్థాన అధికారులు మరియు అదనపు లేబర్ అధికారి..మొదలైన అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు,
సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ... రాబోయే శివరాత్రికి బాల్యవివాహం నిర్ములనకు ప్రతి ఒకరు సహకరించాలని అదేసించారు. బాల్య వివాహము (Child Marriage) అనగా యుక్త వయసు రాక మునుపు అనగా బాల్య దశలో చేసే వివాహము చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వము బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. బాల్య వివాహాలకు ప్రోస్తహించిన , సహకరించిన సుమారు రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు సుమారు లక్ష రూపాయలు జరిమానా ఉంటుందని అన్నారు.
చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే గర్భవతులు కావడం వారి ఆరోగ్య పరిస్థితి మరియు ఎదుగుదల తగిపోతుంది అన్నారు.కావున బాల్యవివాహం నిర్ములనకు ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. .అలాగే కోవిడ్ అధికముగా వునందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతి రోజు మస్కలు, శానిటైజర్ ఉపయోగించాలని కోరారు. మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
No comments:
Post a Comment