మహిళలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిద్దాం నారీ సంకల్పదీక్ష ఛేపడదాం రండీ తరలిరండీ వేలాదిగా రండి
తిరుపతి పార్లమెంట్ పరిధి లో ఉన్న సత్యవేడునియోజకవర్గం లో ఇంచార్జ్ జేడీ_రాజశేఖర్ గారి సహకారం తో తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో నారాయణవనం లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు భాస్కర్ గారు, పార్లమెంట్ నాయకులు గోవిందస్వామి గారు,జనీత గారు,యమున గారు, ఉషారాణి గారు, లత గారు,ఇందు గారు,మహిళలు తదితరులు పాల్గొన్నారు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి_అనిత గారి ఆద్వర్యంలో జోనల్ స్థాయి లో
నెల్లూరు లోని అనీల్ గార్డెన్ లో మార్చి 6వ తేదీ తలపెడుతున్న నారీసంకల్పదీక్ష
ను జయప్రదం చేయాలని ఈ నియోజకవర్గం నుండి మహిళలు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు
చక్రాల ఉష మాట్లాడుతూ
గత 3సంవత్సరాలనుండి జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాలను , అరాచకాలను ఎలుగెత్తి చాటేలా తమ గళం వినిపించాలని కోరారు .
వైసీపీ పాలనలో మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసమే నారీ సంకల్ప దీక్ష ను నిర్వహిస్తున్నట్లు , గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెరిగి , తినలేక పస్తులతో పేదలు జీవనం గడుపుతున్నరన్నారు.విద్యుత్ చార్జీలు పెంచేశారు, ఇంటిపన్ను పెంచుకుంటూ పోతున్నారు, ఇప్పుడు కొత్తగా ఎప్పుడో తాతలు ముత్తాతలు కట్టిన ఇళ్లకు OTS కట్టాలని ప్రజలని నిలువు దోపిడీ కి శ్రీకారం చుట్టడం ఈ దద్దమ్మ ప్రభుత్వానికే చెల్లిందని వాపోయారు.ఆఖరికి చెత్తమీద పన్ను, మరుగు దొడ్డి పన్నులు వేసిన ఘనత తుగ్లక్ రెడ్డి గారికే చెందిందని ఎద్దేవా చేశారు ఈ పెరిగిన ఖర్చులతో కుటుంబ భారం మోయలేక మహిళామాతల్లులు దిన దిన గండం గా బతుకుతున్నారని మహిళలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి పచ్చి దగా చేశారని మద్యపాన నిషేధం చేస్తానని కల్తీ మద్యం తో పేదవాళ్ళ ఆయువుతీస్తున్నారని మద్యం ప్రియుల ఆస్తులని రాయించుకుంటున్నారని రోజు కూలిలు రోజంతా కష్టం చేసి ఆ కూలిని పెళ్ళాం బిడ్డలకు ఇవ్వకుండా జగన్ ట్యాక్సి కట్టేసి పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ప్రశ్నించే వారిపైన దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడం, భయపెట్టడం, జగన్ రెడ్డి పాలనలో సర్వసాధారణంగా మారిందని తెలియజేసారు మహిళలకు భద్రత కరువైoదని దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు హత్యలు రోజు కృత్యాలుగా మారాయని బాధపడుతూ
జగన్ రెడ్డి పాలనలకి చరమగీతం పాడి తిరిగి అందరూ సంతోషం గా బతకాలంటే చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేసే వరకు ఈ నారీ సంకల్ప దీక్ష ఆగదని తెలియజేశారు
No comments:
Post a Comment