సేవా దృక్పథంతో భక్తులకు సేవలు అందించండి అని పిలుపునిచ్చిన ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు యువతరం సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణఅధికారి పెద్దిరాజు గారి చేతుల మీదుగా యువతరం సేవాసమితి వాలంటరీ లకు టీషర్ట్ లు, మాస్కులు, హాట్ లు అందించారు. అనంతరం పెద్దిరాజు గారు వాలంటరీ లకు తగు జాగ్రత్తలు, సూచనలు తెలిపినారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు సేవా దృక్పథంతో సేవలందించాలని తెలిపినారు.
యువతరం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ.... ఈ మహా శివరాత్రికి సుమారు 120 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని తెలిపారు. అలాగే తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఉచితంగా టి షర్ట్ అందించారు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment