రాష్ట్రంలో నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్లలిస్ట్స్ యూనియన్ ఏర్పాటు.
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం :
విజయవాడ ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో జర్నలిస్టుల కొత్త ట్రేడ్ యూనియన్ ఏర్పాటయింది. ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్1926 కార్మిక సంఘాల రిజిస్ట్రార్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్లలిస్ట్స్ యూనియన్ నమోదయ్యింది. జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఎడిటర్లు మరియు జర్నలిస్టులు కలిసి నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఏర్పాటు చేశారు శుక్రవారం రోజు విజయవాడలో రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ లక్ష్మీనారాయణ చేతులమీదుగా యూనియన్ రిజిస్ట్రేషన్ పత్రం మరియు బైలాస్ ను రాష్ట్ర అధ్యక్షులు సి.సూరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. మస్తాన్ వలి, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్. అన్వర్ భాష , కోశాధికారి షేక్. మహబూబ్ సుభాని, యూనియన్ నాయకుడు కరీమ్ బేగ్ లు అందుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ లక్ష్మీనారాయణ యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు
జర్నలిస్టుల సంక్షేమమే నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ లక్ష్యం:
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సి.సూరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ అన్వర్ భాష, కోశాధికారి షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు, గృహ నిర్మాణం వంటి సదుపాయాలను వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. మెరుగైన వైద్య సదుపాయం, ప్రమాదంలో మరణించిన జర్నలిస్టులకు 20 లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లించాలన్నారు. రాష్ట్రంలో వార, పక్ష, మాస పత్రికలకు, స్థానిక దిన పత్రిక లకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలన్నారు. వార పక్ష మాస పత్రికలకు జి.ఎస్.టి ని రద్దు చేయాలన్నారు 142 జీవోను సవరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.వార, పక్ష, మాస పత్రిక లకు స్టేట్ బస్ పాస్ సౌకర్యం కల్పించడంతో పాటు రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున అక్రిడేషన్ మంజూరు చేయాలన్నారు. 15 సంవత్సరాలు అనుభవం కలిగిన ప్రతి జర్నలిస్టు కు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 లో మరణించిన కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాను తక్షణం పంపిణీ చేయాలన్నారు . కేబుల్ ఛానెల్స్ కు అక్రిడిటేషన్ సదుపాయం కల్పించాలన్నారు జర్నలిస్టుల పై దాడులు జరగకుండా దాడుల నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టుల సంఘాలకు అక్రిడేషన్ కమిటీలలో సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని అన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment