గురువులు దేవుళ్ళతో సమానం అని తెలిపిన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కాట్ శంకర్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి బి ఎస్ జెడ్పి బాయ్స్ హై స్కూల్ నందు ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది.
తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు అధ్యాపకులను పూల బొకేతో సన్మానం చేసి, అనంతరం స్వీట్లు పంచారు.
ఆర్కాట శంకర్ మాట్లాడుతూ .. భారతదేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున మన ఉపాధ్యాయుల దినోత్సవం గా జరుపుకుంటాము .ఆయన మొదట్లో ఒక ఉపాధ్యాయుడు, మన రాష్ట్రంలో ఒకరు ఒక స్కూల్ టీచర్ కావడం అనేది మన దేశంలో ఉన్న టీచర్లందరికి ఎంత గర్వకారణం. మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదిగా మన సంప్రదాయంలో మనం ఎప్పుడూ గుర్తించాము. ఎంతగా అంటే ఆచార్యదేవోభవ అని మనం గురువుని దేవుడితో సమానంగా చూస్తాం. ఎందుకంటే సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాలలో వారి తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ఉపాధ్యాయులు దగ్గర ఎక్కువ కాలాన్ని గడుపుతారు. తల్లితండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే వారి కంటే కూడా పిల్లల మీద మంచి ప్రభావం చూపించగల వారు అక్కడ ఉంటారని అర్థం
No comments:
Post a Comment