ఘనంగా జరిగింది ప్రపంచ ఫార్మసిస్ట్ డే దినోత్సవం, ఫార్మసిస్ట్ లను సన్మానించిన శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని శ్రీకాళహస్తి డ్రగ్గిస్ట్ మరియు కెమిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంనకు సంస్థ ప్రెసిడెంట్ నరసింహులు మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్నంలోని మెడికల్ షాప్ ఫార్మసిస్ట్ సన్మానం చేశారు.
సీనియర్ ఫార్మసిస్ట్ ముని రెడ్డి మాట్లాడుతూ.... ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి మెడికల్ అసోసియేషన్ వాళ్లు మాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే మాపై బాధ్యత పెరుగుతూ ప్రభుత్వా విధి విధానాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు
No comments:
Post a Comment