ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఎల్ఐసి కాలనీలోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల నందు సర్వేపల్లి రాధాకృష్ణ గారి 136వ జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ షర్లి మరియు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.... ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుల పట్ల గౌరవభావం కలిగి, వారు అందించే విద్యతో జ్ఞానాన్ని పెంచుకొని ఉజ్వల భవిష్యత్తును పొందాలని అన్నారు.
అనంతరం బాల బాలికలకు సాంస్కృతి కార్యక్రమాలు ఉపాధ్యాయుల కొరకు ప్రదర్శించి అందర్నీ అలరించారు. వినోద భరితమైన నాటకములను చాలా చక్కగా విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. చివరగా ప్రధానోపాధ్యాయులు ప్రతి ఒక్క ఉపాధ్యాయుని చేతులమీదుగా ఒక్కొక్క మొక్కను నాటి నాటించి బావి భవిష్యత్తుకు ఆదర్శప్రాయంగా నిలవాలి అని తెలిపారు.
No comments:
Post a Comment