ఉపాధ్యాయులకు అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సత్కారం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, September 5, 2023

ఉపాధ్యాయులకు అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సత్కారం

 టీచర్స్  దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులను  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఘనంగా సత్కరించారు. 


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

విశ్వంలో నిస్వార్ధమైన వృత్తి  ఉపాధ్యాయ వృత్తిని, ప్రతి ఒక్కరి జీవితాలకు బంగారు బాటలు వేసే ఉపాధ్యాయులను సత్కరించడం మన కర్తవ్యం అని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.  

గురుపూజోత్సవం సందర్భం గా గురువులకు సత్కార కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు చేపట్టారు. స్వర్గీయ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు అంజూరు సరోజనమ్మ తన తల్లి గారి పేరిట శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి లోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు విశ్రాంతి ఉపాధ్యాయులను టీచర్స్ డే సందర్భంగా చైర్మన్ ఘనంగా సత్కరించి శ్రీకాళహస్తీశ్వరుని చిత్రపటాన్ని,  స్వామి వారి ప్రసాదాలను బహూకరించారు. గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. 

దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విశ్వంలో నిస్వార్ధ వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి అన్నారు.  ఉపాధ్యాయులు తన బిడ్డలకు ఎలా చదువు చెబుతారో  అందరి  బిడ్డల కు  అదే విధంగా చదువు జ్ఞానాన్ని కలిగించి వారికి బంగారు భవిష్యత్ కల్పించే విధంగా బాటలు వేస్తారన్నారు. ఏ స్థాయికి ఎదిగిన గురువును మర్చిపోలేమని,  సదా ఎల్లవేళలా గురువులకు రుణపడి ఉండాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు స్వర్ణ మూర్తి మాట్లాడుతూ సత్కారం చేయడం ఆనందకరమన్నారు. తన తల్లి గురువుగా తాను కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటూ గురువుగా తదుపరి దేవస్థానం చైర్మన్ గా ఉన్నత శిఖరాలు అందుకోవడం ఉపాధ్యాయ రంగానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల వెంకన్న ,పి స్వర్ణ మూర్తి,జి.సుధాకర్ రెడ్డి,పసల.రమణయ్య,ఇ.వెంకట్రామానాయుడు,జ్ఞానప్ప,గోపాలస్వామి,నంద సభద్రిమ్మ. తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad