ఫోక్సో చట్టం ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపిన న్యాయవాదులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని అమరావతి జూనియర్ కాలేజ్ నందు ఫోక్సొ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ ,అరుణ్, కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేష్, కల్పన మరియు పారా లీగల్ వాలంటరీ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయవాదులు మాట్లాడుతూ..... విద్యార్థులకు ఫోక్స్ చట్టం గురించి అవగాహన కల్పించారు. కౌమారులను చైతన్యం పరుద్దాం- బాల్యాన్ని కాపాడుకుంటాం అని తెలిపారు . ముఖ్యంగా ఈ చట్టంలో చేయకూడని పన్నులు బాలికలకు అసభ్య చిత్రాలు మొబైల్ ద్వారా చూపించటం వల్ల సుమారు మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా ,
బాలికల దగ్గరకు వెళ్లి తాకే ప్రయత్నం చేయటం వల్ల మూడు సంవత్సరాలకు తగ్గకుండా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా మరియు విద్యార్థినిలను తాకరాని చోట తాకుట, ఒంటరిగా ఉన్నప్పుడు విద్యార్థులు టీజ్ చేయడం, ఇలాంటివన్నీ అరికట్టాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు 100 ,1098 ,112, 181 మరియు 108 నెంబర్ లపై అత్యవసర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మరియు న్యాయ సలహాల 15100 డయల్ చేయాలని తెలిపారు
No comments:
Post a Comment