శాస్త్ర యుక్తంగా మూలవిరాట్ ల కు పవిత్ర మాలలు సమర్పణ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పవిత్రోత్సవాలు విజయవంతంగా నిర్వహించి మూలవిరాట్లకు పునర్తేజం వచ్చేలా పూజలు జరిగాయన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు
శ్రీకాళహస్తి ఆలయం లో గత ఐదు రోజులు గా చేపట్టిన పవిత్ర ఉత్సవాలు వేదో యుక్తంగా సాగి చివరి రోజు శుక్రవారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు దేవస్థానం ఈవో కేవీ సాగర్ బాబు సారధ్యంలో చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథుని గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు ప్రధాన అర్చకులు యాగశాలలో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. కలశాలకు విశేష పూజలు జరిపి కలశ ఉద్వాసన చేసి ఆలయ ఆవరణంలో వైభవంగా ఊరేగించి స్వామి అమ్మవార్ల మూలవిరాట్లకు కలశ జలాలతో విశేష అభిషేకాలను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను వేడుకోగా తీసుకువెళ్లి ఆలయ ఆవరణంలోనూ, ఆలయం లోపల ఉన్న మూలవిరాట్ ల కు పవిత్ర మాలలు ను సమర్పణ వేదో యుక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దంపతులకు, ఈవో సాగర్ బాబు దంపతులకు ధర్మకర్తల మండలి సభ్యులకు అధికారులకు పవిత్ర మాలలో వేసి తీర్థప్రసాదాలు బహూకరించారు.
ఈ విశేష పూజలతో ఏడాదిపాటు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పొరపాటున దొర్లిన తప్పులు దోషాలు నివారించి మూలవిరాట్లకు పునర్తేజం వచ్చే విధంగా వేదోయుక్తంగా సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపామని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు బుల్లెట్ జై శ్యామ్, మహిధర్ రెడ్డి, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పండు, శ్రీదేవి దేవస్థానం అధికారులు డిప్యూటీ ఈఓ వెంకట సుబ్బయ్య, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం, దేవస్థాన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి, అభిషేక గురుకుల్ రాజేష్ గురుకుల్, నిరంజన్ గురుకుల్, సురేష్ గురుకుల్, వేదపండితులు శ్రీనివాస శర్మ, మారుతి శర్మ, ఆంజనేయులు శర్మ, మరియు దేవస్థానం అర్చకులు మరియు దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment