రన్ శ్రీకాళహస్తి రన్ (3 కె రన్) విజయవంతం. పాల్గొన్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ హృదయ దినోత్సవ సందర్బంగా శుక్రవారం శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ శ్రీకాళహస్తి రన్ (3కె రన్ ) విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి RDO రామారావు , మునిసిపల్ కమీషనర్ రమేష్ బాబు , శాసన సభ్యులు మధుసూదనరెడ్డి కుమారుడు ఆకాష్ రెడ్డి * లు జండా ఊపి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి పట్టణ ఆరోగ్య ప్రియులు, MGM సిబ్బంది మరియు MGM కళాశాల విద్యార్థిని, విద్యార్థులు దాదాపు 350 పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో MGM గ్రూప్ *డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవ సందర్బంగా MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో చేపట్టే ఈ రన్ శ్రీకాళహస్తి రన్ (3కె రన్) కార్యక్రమానికి హాజరైన శ్రీకాళహస్తి RDO రామారావు గారికి, మునిసిపల్ కమీషనర్ రమేష్ బాబు గారికి, *శాసన సభ్యులు మధుసూదనరెడ్డి కుమారుడు ఆకాష్ రెడ్డి * గారికి మరియు హాజరైన శ్రీకాళహస్తి జిమ్ సభ్యులకు , MGM సభ్యులకు మరియు MGM కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు గతంలో కూడా ఎన్నో చేశామని, అలాగే ప్రతి ఒక్కరు ప్రతి రోజు వ్యాయామం, యోగ, రన్నింగ్, చేయటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని తెలిపారు. MGM హాస్పిటల్స్ నందు అత్యవసర వైద్య సేవలకై 24 గంటలు వైద్య బృందం అందుబాటులో ఉంటారని, ఉచిత వైద్య సేవలకై ఆరోగ్యశ్రీ మరియు ప్రముఖ ఇన్సూరెన్సు ల సౌకర్యం కలదని తెలిపారు.
No comments:
Post a Comment