శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన గోశాలకు చెన్నై వాస్తవ్యులు గోదానం మరియు సంరక్షణకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులుకు అందజేశారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానముకు అనుబంధమైన గోశాలకు చెన్నై వాస్తవ్యులు అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి గోవును దానంగా అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సమక్షంలో గోవును మరియు గోసంరక్షణకు 10,116/-(పది వేల నూట పదహారు రూపాయల) శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు అందజేశారు. ఆలయానికి గోమాతను దానంగా అందించిన దాతలను దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఆ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు దాతలను శేషవస్త్రాలతో సత్కరించి వేదపండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు,మరియు గోశాల అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment