జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, చిత్తూర్ మరి శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ వారి ఆదేశాల మేరకు ,శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైల్ ను సందర్శించిన న్యాయవాదులు
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, అరుణ్ మరియు పారా లీగల్ వాలంటరీ ,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు .
సబ్-జైలు పరిసర ప్రాంతాలు, వారి వసతి గదులు, భోజనశాల ...మొదలైనవి పరిశుభ్రతపై పరిశీలించారు.
తర్వాత ఖైదీలకు పెట్టె భోజనము,ఆరోగ్య సమస్యల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.
ఖైదీలతో మాట్లాడి సమస్యల పై అరా తీశారు.
న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ..... ఖైదీలతో మాట్లాడినప్పుడు న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే తెలపాలనన్నారు , అనంతరం ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు, సమస్యలు ఏమైనా ఉంటే అర్జీ రూపంలో అందిస్తే తక్షణమే పరీక్షరించుటకు ప్రయత్నిస్తానని అన్నారు.
No comments:
Post a Comment