తిరుగుడు మల్లా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులును ఆహ్వానము
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామం (తిరుగుడు మల్లాం) శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గారిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు చిలకూరు సాయికుమార్ రెడ్డి గారు ఆహ్వానించారు.
దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వయంభువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల విజయవంతం కావాలని తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల వారి కోరుకుంటున్నాను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment