MGM హాస్పిటల్స్ నందు ఉచిత కో వాక్సిన్ బూస్టర్ డోస్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యం లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య దృష్ట్యా తప్పక బూస్టర్ డోస్ వేసుకోవాలనే ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పుడు MGM హాస్పటల్స్ నందు కో వాక్సిన్ బూస్టర్ డోస్ ఉచితం గా వేస్తామని డైరెక్టర్ గుడ్లూరు మయూర్ ఒక ప్రకటనలో తెలిపారు. హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ దాదాపు ఐదు లక్షల విలువ చేసే రెండువేల కోవాక్సిన్ బూస్టర్ డోస్ లను మేము ప్రజలకు ఉచితం గా వేయుటకు సిద్ధంగా ఉన్నామని శ్రీకాళహస్తి మరియు చుట్టు ప్రక్క ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనగలరని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 7288877300 ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచామని ప్రతి భారత పౌరుడు ఈ బూస్టర్ డోస్ ని వేయించుకొని కరోనా నిర్ములనలో భాగస్వాములు కావాలని తెలిపారు. డిసెంబర్ 31 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
No comments:
Post a Comment