ఏడు గంగమ్మ మూలవిరాట్కు పంచనామా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, February 6, 2024

ఏడు గంగమ్మ మూలవిరాట్కు పంచనామా

 ఏడు గంగమ్మ మూలవిరాట్కు పంచనామా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :



శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ ఏడు గంగమ్మ దేవాలయము  పునర్నిర్మాణం భాగంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం అధికారులు ఏడు గంగమ్మ కమిటీ సభ్యులు రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది పట్టణ ప్రముఖులు , మీడియా మిత్రుల సమక్షంలో ఏడు గంగమ్మ మూలవిరాట్కు పంచనామ కార్యక్రమాలు నిర్వహించారు.


దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర దివ్య క్షేత్రములొ అనుబంధ దేవాలయమైన ఏడు గంగమ్మల దేవాలయముకు పునర్నిర్మాణ భాగంలో ఈరోజ మూలవిరాట్ కు ఎండోమెంట్ సిబ్బంది,రెవెన్యూ,పోలీసు అధికారులు సమక్షంలో పంచనామా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఈ పంచనామ కార్యక్రమంలో మూల విరాట్ కింద చిన్న బంగారు రేకు, చిన్న వెండి రేకు మరియు రాగి యంత్రం, ఐదు రూపాయలు ఒక రూపాయి, అర్ధ రూపాయి,నాణ్యాలు మాత్రమే దొరికేయని తెలిపారు. వీటిని అనుబంధ దేవాలయం ఇంచార్జ్ కి అందజేశాము. అదేవిధంగా ఏడు గంగమ్మల మూల విరాట్ ను శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో భద్రపరిచినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యురాలు రమాప్రభ  అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీ ఈవో వెంకట్ సుబ్బయ్య, ఏఈఓ సతీష్ మాలిక్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ సూర్య ప్రసాద్, స్థపతి కుమార్, అనుబంధ దేవాలయం ఇంచార్జ్ లక్ష్మయ్య, కాంట్రాక్టర్ భాస్కర్ ముదిరాజ్, ఏడు గంగమ్మ కమిటీ సభ్యులు అంజూరు బాలసుబ్రమణ్యం, స్వర్ణ మూర్తి, మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులు, మీడియా మిత్రులు, పట్టణ ప్రముఖులు , దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad