చక్రాల ఉషా ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, February 22, 2024

చక్రాల ఉషా ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు

 వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న  చైతన్యాన్ని మేల్కొల్పుతూ  ఉన్నత లక్ష్యం వైపు బాటలు వేస్తూ ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో  ముఖ్యఅతిథిగా

ఆచార్య అజిత్ జి

1993 లొ ఇండియా ఆన్ ది మూ ఫౌండేషన్ చైర్మన్  గత 30 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మారుమూరుమూల గ్రామం నుండి  యూనివర్సిటీల వరకు   విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్, యోగ, స్వచ్ఛభారత్ , మహిళా శక్తి, యువశక్తి లపై, యువతకు విద్యార్థులకు అవగాహన చేస్తూ వారిలోని సృజనాత్మకతను జాగృతి చేస్తూ యువతను,విద్యార్థులు రథసారదులై వారు భవిష్యత్తులో రాణించే విధంగా, దేశంకోసం, దేశ శ్రేయస్సుకోసం, నేటి యువత అందలోను ముఖ్యంగా విద్యార్థినీలు, ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో భారతదేశం మొత్తం తిరుగుతూ, , విద్యార్థినిలకు, మహిళాశక్తి చే దేశం ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందో,దేశంలోని గర్వించదగ్గ మహిళల యొక్క ప్రత్యేకతను ఎయిర్ ఫోర్స్ ,

న్వవి , మిలటరీ అదేవిధంగా క్రీడా రంగాల్లో వ్యాపార రంగాల్లో , విద్యారంగంలో మహిళల యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ, విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం చేపడుతున్న ఆచార్య అజిత్ జి నేడు 

ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో నేడు  శ్రీకాళహస్తిలోని  MGM పాఠశాల నందు,ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాల నందు, గురుకుల పాఠశాల నందు నేడు విద్యార్థులకు వారి భవిష్యత్ కార్యాచరణ పై, దేశ చరిత్ర గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, స్వతంత్ర సమరంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మరియు అనేకమంది స్వతంత్ర సమరయోధుల గురించి వివరంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో విద్యార్థులు దేశానికి ఏ విధంగా సేవలు అందజేయాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు


ఈ సందర్భంగాఇండియా ఆన్ ది మూ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ..

విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినిలు ,విద్యార్థులు, మొదటగా వారి యొక్క వంశవృక్షం గురించి తెలుసుకోవాలని ,తద్వారా వారి తాత ముత్తాతలు ఏ విధంగా దేశానికి సేవలు అందజేశారు వారికి అవగాహన ఏర్పడుతుందని ,తద్వారా వారు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేయాలో, వారికి వారే ,పటిష్టమైన నిర్ణయంతో ముందుకు పోతారని, ఇలాంటి కార్యాచరణ ప్రతి ఒక్క విద్యార్థి నేటి నుంచి చేపట్టాలని తెలియజేశారు, నేటి విద్యార్థులే రేపటి పౌరులని నేడు విద్యార్థిదశలో ఉన్న విద్యార్థులు, విధంగా విజ్ఞానం వైజ్ఞానం పెంపొందించుకోవాలో    వారు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, తను నేడు భారతదేశంలో మొత్తం ప్రయాణిస్తూ విద్యార్థులకు పై విషలపై అవగాహన చేస్తున్నానని, తను చేస్తున్న అవగాహనపై కనీసం 10 శాతం విద్యార్థులు వారి భవిష్యత్తుపై తాను చెప్పిన విధంగా కార్యాచరణ చేపడితే, భవిష్యత్తులో వారు గొప్ప స్థానాల్లో ఉండి దేశం గర్వించేతగా వ్యక్తులుగా తయారు అవుతారని, నేడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, దేశానికి సేవ చేస్తే తమ తల్లిదండ్రులతో పాటు గ్రామలకు, రాష్ట్రలకు సేవ చేసినట్లేనని, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని దేశభక్తి కై, దేశ సేవకై, కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థినీలు నేడు దేశం గర్వించదగ్గ అన్ని రంగాల్లోనూ నిపుణులైన ,మహిళా మణుల యొక్క విషయాలని తెలుసుకుంటూ వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విద్యార్థినిలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి వారిని మరొక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకునే విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని భవిష్యత్ కార్యాచరణ పై నేటి నుంచే కృషి చేయాలని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్  మునిరత్నం, అధ్యాపక బృందం  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad